మంత్రి కారుకు ప్రమాదం-తృటిలో బయటపడ్డ లక్ష్మణ్ కుమార్

  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు పెనుప్రమాదం తప్పింది
  • మారుతీనగర్ వద్ద కారు టైర్ ఊడిపోవడంతో తీవ్ర ప్రమాదం

జగిత్యాల, జూన్ 28 (విశ్వం న్యూస్): మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కి పెనుప్రమాదం తప్పింది. కోరుట్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, అనంతరం ధర్మపురి వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. మెట్‌పల్లి మండలం మారుతీనగర్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్ ఒక్కసారిగా ఊడిపోవడంతో క్షణాల్లో ప్రమాదం ఏర్పడింది.

అయితే, డ్రైవర్ చాకచక్యతో కారును సురక్షితంగా ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. తక్షణమే మరో కారులో ఆయన ధర్మపురికి వెళ్లారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన కారు తీవ్రంగా దెబ్బతింది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే మంత్రి సురక్షితంగా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *