కరీంనగర్‌లో అలయన్స్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సమావేశం

కరీంనగర్‌లో అలయన్స్ క్లబ్స్
డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సమావేశం

విశ్వం న్యూస్ / కరీంనగర్, ఫిబ్రవరి 17: కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్‌లో ఉన్న అచీవర్స్ పాఠశాలలో మంగళవారం అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ 137/ఏ క్యాబినెట్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై సి.హెచ్. వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ బాధ్యులకు ఇంటర్నేషనల్ ఎస్.ఎం.సి అవార్డ్స్‌లో బ్రిడ్జ్ బిల్డర్ అవార్డు, 100 శాతం డి.జి అవార్డు పొందిన డిస్ట్రిక్ట్ గవర్నర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అవార్డు పొందిన కొంజెర్ల మహేష్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ అవార్డు పూలాల శ్యామ్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ అవార్డు కే. సుధాకర్, డిస్ట్రిక్ట్ పి.ఆర్.ఓ అవార్డు పొందిన ఎం. సాగర్ రెడ్డిలను శాలువాలతో ఘనంగా సత్కరించి మెమొంటోలు అందజేశారు.

అనంతరం 2026–27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా కొంజెర్ల మహేష్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్–1గా సుదగోని ప్రసాద్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్–2గా విద్యాసాగర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా పండుగ నాగరాజు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్‌గా సోమారపు వెంకన్న, డిస్ట్రిక్ట్ పి.ఆర్.ఓగా పూలాల శ్యామ్ ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ డా. ఎలగందుల శ్రీనివాస్, కోలా అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, డా. గాలిపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *