హుజురాబాద్ పట్టణ సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి

హుజురాబాద్ పట్టణ సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి

హుజురాబాద్, ఫిబ్రవరి 17 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ పట్టణంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రొంటాల సుహాసినికి జామే మస్జిద్ ఈద్గా ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు చైర్మన్ రొంటాల సుహాసిని హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ నివాసానికి మర్యాదపూర్వకంగా వచ్చిన సందర్భంగా, ఆయన శాలువా, పుష్పగుచ్ఛాలు అందజేసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ— పట్టణంలో కోతులు, కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, వాడలలో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, రోడ్లు మరియు మురికికాలువలు లేని ప్రాంతాలలో అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని కోరారు. రంజాన్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ముస్లిం ఖబ్రస్తాన్లలో తుమ్మచెట్లు, గడ్డిని తొలగించి పరిశుభ్రత పనులు నిర్వహించాలని, మసీదుల వద్ద వీధిదీపాలు ఏర్పాటు చేసి ప్రతిరోజూ బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు. అలాగే పట్టణంలోని నాలుగు ముస్లిం ఖబ్రస్తాన్లను పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని, మసీదుల వద్ద రోజువారీగా నీటి ట్యాంకర్ సరఫరా చేయాలని, ఉదయం వేళ చెత్తాచెదారం తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసం దృష్ట్యా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, ఈద్గా వద్ద పండుగ ఏర్పాట్లకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సయ్యద్ అబ్దుల్ అజీమ్, మహమ్మద్ అబ్దుల్ అలీమ్, మహమ్మద్ మురాద్ హుస్సేన్, మిర్జా ఇమ్రాన్ బేగ్, ఆబిద్, జుబేర్, సల్మాన్, 16వ వార్డ్ మున్సిపల్ సభ్యులు బండా నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *