ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కొరకు జనవరి 24న జాబ్ మేళ నిర్వహణ

జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు
పెద్దపల్లి, జనవరి 19 (విశ్వం న్యూస్) : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు పెద్దపల్లి బస్టాండ్ దగ్గర గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (Govt. ITI)లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు నేడోక ప్రకటనలో తెలిపారు. హైదరాబాదులోని టీం లీజ్ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ అసోసియేట్స్, డెలివరీ కన్సల్టెంట్, టీమ్ మెంబర్ గా పని చేయుటకు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగి, పదవ తరగతి నుండి డిగ్రీ అర్హత కలిగిన ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు పూర్తి సమాచారంతో, జిరాక్స్ సర్టిఫికేట్ కాపీలతో జాబ్ మేళా నిర్వహించే రోజున హాజరుకావాలని, ఎంపిక కాబడిన వారికి ఉద్యోగ స్థాయిని బట్టి నెలకు 10 వేల నుండి 25 వేల వరకు వేతనం ఇవ్వబడుతుందని, మరిన్ని వివరాలకు 8985336947, 9502642441 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.