కవితకు ఈడీ నోటీసులు

కవితకు ఈడీ నోటీసులు

హైదరాబాద్, మార్చి 8 (విశ్వం న్యూస్) : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడీ నోటీసులిచ్చింది. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల డిమాండ్‌పై ఆందోళనకు కవిత పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కవితకు ఈడీ నోటీసులు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *