ఎర్రవెల్లిలో కేసీఆర్ జన్మదిన సందడి

ఎర్రవెల్లి, ఫిబ్రవరి 17, 2026 (విశ్వం న్యూస్) : కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎర్రవెల్లి నివాసానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన శ్రేయోభిలాషులతో నివాసం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా కె. చంద్రశేఖర్ రావు అభిమానులను ఆప్యాయంగా కలిసి, వారితో కలిసి ఫొటోలు దిగారు. అభిమానుల శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి ప్రేమాభిమానాలు తనకు మరింత బలమని కేసీఆర్ పేర్కొన్నారు.