రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

తిమ్మాపూర్, జనవరి 19 (విశ్వం న్యూస్) : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని మానేరు వంతెన పైన గురువారం రాత్రి తిమ్మాపూర్ మండలం మహా త్మనగర్ గ్రామానికి చెందిన అన్వర్ (40) అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై కరీంనగర్ వెళ్తున్న తరుణం లో ప్రధాన వంతెన పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థాని కులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.