నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

ములుగు, జనవరి 4, (విశ్వం న్యూస్) : గోవిందరావుపేట ,జనవరి 4; (విశ్వం న్యూస్) :- తెలంగాణ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం ( TS TWTU ) గోవిందరావుపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కర్లపల్లి లో బుధవారం నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ క్యాలండర్ రాష్ట్ర గిరిజన సంక్షేమ గెజిటెడ్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షలు కల్తీ. శ్రీనివాస్ మరియు సంఘం మండల అధ్యక్షులు రాళ్లపల్లి. వెంకటేశ్వర్లు, కార్యదర్శి . రవికుమార్ కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ములుగు జిల్లా బాద్యులు యాలం. ఆదినారాయణ, దయసాగర్, నర్సయ్య, కల్తీ. కృష్ణమూర్తి, కోరం. నర్సయ్య, యాప, సమ్మయ్య, శ్రీకాంత్, ముద్దబోయిన. మల్లయ్య, అశోక్, రాజు, డైప్యూటీ వార్డెన్ రాములు,జగపతి, సత్యనారాయణ, లక్ష్మయ్య పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయ సంఘం నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *