పీర్జాదిగూడ కార్పొరేషన్ 17వ
డివిజన్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్
శివకుమార్ గౌడ్ హాజరు
పీర్జాదిగూడ, మే 25 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ కార్పొరేటర్ కం డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక కమిషనర్ వంశీకృష్ణ, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.