ఘనంగా 76వ గణతంత్ర
దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, జనవరి 26 (విశ్వం న్యూస్) : 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా IPC తెలంగాణ స్టేట్ ఆఫీస్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డా. గూడూరి చెన్నారెడ్డి మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్యం సాధనలో మన పూర్వీకులు చేసిన త్యాగాలను గుర్తు చేశారు. వారు ధనం, ప్రాణం అర్పించి తెచ్చుకున్న ఈ స్వాతంత్ర్యాన్ని మనం రక్షించి, వారి ఆశయాలను మన పిల్లలకు బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు.
మోతి నగర్ హౌసింగ్ సొసైటీలో కార్యక్రమం:
ఆ తరువాత, చెన్నారెడ్డి గారు మోతి నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో శ్రీ సిహెచ్. హనుమంతరావు అధ్యక్షతన జరిగిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీవాసుల పట్టుదలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని, ఇదేవిధంగా కాలనీ అభివృద్ధికి అందరూ కలిసి శ్రమించాలని కోరారు.

మోతి నగర్ ఎక్స్ రోడ్డులో బీజేపీ కార్యక్రమం:
తదనంతరం, మోతి నగర్ ఎక్స్ రోడ్డులో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మూర్తి నగర్ చౌరస్తా దినచర్య కూలీల వారిని ఉద్దేశించి మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధుల లేదా ప్రభుత్వ అధికారుల సహకారాన్ని పొందాలని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఏవైనా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైతే, తమ మద్దతు ఉండేలా హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమాల్లో జి. విజయలక్ష్మి, కె.హెచ్.ఎస్. శర్మ, జి మహేందర్ రెడ్డి, వి. రాధాకృష్ణ, పి. వెంకట దాసు, సి. శోభా రెడ్డి, జి. శ్రీధర్ రెడ్డి, జి. వన్ రాజ్ రెడ్డి, బి. నాగేశ్వరరావు, రమేష్ అయ్యంగారు, డీకే గోపాల్ రావు, కె. మల్లికార్జున్ రావు, హేమంతరావు, కె. శ్రీలత, కె. శ్రీనివాసరావు, జి. రమేష్, ఎం. విష్ణువర్ధన్ రెడ్డి, సద్గుణ రెడ్డి, పిట్లం మనోహర్, శోభారాజన్, సాయి, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.