రాష్ట్ర ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి, బండ శ్రీనివాసుకి ఘనంగా సన్మానం

రాష్ట్ర ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి,
బండ శ్రీనివాసుకి ఘనంగా సన్మానం

హుజురాబాద్, ఏప్రిల్ 17 (విశ్వం న్యూస్) : సోమవారం రోజు సాయంత్రం హుజురాబాద్ లారీ ఓనర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ లకు లారీ ఓనర్ అసోసియేషన్ భవనములో తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసులకు రుమాలీ టోపీ శాలువలతో భారీ ఎత్తున సత్కరించారు.

ఈ సందర్భంగా మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రంజాన్ నెలలో హిందూ ముస్లిం క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు కలిసి మెలిసి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలకు అందరూ కలిసి మెలిసి గంగాజమున తహసి బి లాగా జరుపుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పాడి కాశిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ముస్లిం సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

పిలువగానే ఈ కార్యక్రమానికి హాజరైనందుకు విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసలకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ లారీ ఓనర్ అసోసియేషన్ సంఘ నాయకులు, ఎండి సలీం, ఎండీ కోరే జానీ, ఎండి ఖాజా పాషా, మహమ్మద్ మహిముద్ ఖాన్, మహమ్మద్ గౌస్ ఖాన్, మహమ్మద్ ఇసుఫ్, మొహమ్మద్ రషీద్, ఎండి అహ్మద్, మజారుద్దీన్ మునీర్ హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గందె రాధిక, వైస్ చైర్మన్ నిర్మల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ రమ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *