అభిమానంతో… మురిసిపోయిన పాడి

అభిమానంతో… మురిసిపోయిన పాడి

అభిమానంతో కౌశిక్ రెడ్డికి పెయింటింగ్ గీసి అంకితమిచ్చిన ప్రముఖ చిత్రకారుడు ప్రభు
జమ్మికుంట, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు) భారత రాష్ట్ర సమితి హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ నియమితులైన సందర్భంగా శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డిని గురువారం రోజున హుజురాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి తను గీసి ఆర్ట్ పెయింటింగును బహుకరించారు.

తన ఫోటో పెయింటింగును చూసి మురిసిపోయిన శాసనమండలి సభ్యులు ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ప్రముఖ చిత్రకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు) ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి యువజన విభాగం హుజురాబాద్ నియోజకవర్గం నాయకులు అంబాల రాజు, ఇనుగాల సతీష్ సప్పి రజనీకర్ ఇనుగాల విష్ణు తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *