హుజురాబాద్:ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించిన డీఎంహెచ్వో

హుజురాబాద్:ప్రాంతీయ ఆసుపత్రిని
సందర్శించిన డీఎంహెచ్వో

హుజురాబాద్, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారినిగా నియమించబడిన తర్వాత హుజురాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిని ప్రప్రదమంగా డీఎంహెచ్వో డాక్టర్ కే లలితాదేవి సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ తో కలిసి అన్ని వార్డులను సందర్శించారు. గర్భిణీ స్త్రీల సంబంధించిన వార్డులు, లేబర్ రూములను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తరువాత హుజురాబాద్ డివిజన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డి.ఎం.హెచ్వో.మాట్లాడుతూ కంటి వెలుగు ఆరోగ్య మహిళ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలులో 100 శాతం ప్రగతి సాధించాలని కోరారు ప్రతి వైద్యాధికారి మరియు సిబ్బంది పని వేళలు పాటించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హుజురాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రారంభించారు. మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని ముందు జాగ్రత్తగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని ఈ వ్యాక్సిన్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆసుపత్రి మరియు జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని ప్రికాషనరీ డోస్ వేయించుకోవాలని తెలియజేశారు. మరియు గర్భిణీ స్త్రీలందరికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య పరీక్షలు చేసి సాధారణ ప్రసవాలను పెంచాలని చెప్పారు.

ఈ సమీక్ష సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ కే లలితాదేవి, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు, డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ నారాయణ రెడ్డి, ఆర్ఎంవోలు డాక్టర్ ప్రసాద్, మరియు డాక్టర్ శ్రీకాంత రెడ్డి, డెమో రంగారెడ్డి, ఎస్ ఓ కాంతారావు, సిహెచ్ఓ సాజిద్ హుస్సేన్, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ నాగ శేఖర్, డాక్టర్ జ్యోతి హెల్త్ ఎడ్యుకేటర్స్, అశోక్, రవీందర్, మరియు జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *