వల్లెపు ఆంజనేయులు నివాసంలో
మంత్రి నిరంజన్ రెడ్డికి తేనీటి విందు

వల్లెపు ఆంజనేయులు నివాసంలో
మంత్రి నిరంజన్ రెడ్డికి తేనీటి విందు

వనపర్తి, ఏప్రిల్ 24 (విశ్వం న్యూస్) : వరి ధాన్యాలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వనపర్తి జిల్లాకు విచ్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి మార్గమధ్యంలోని షాపుర్ గ్రామానికి చెందిన వల్లెపు ఆంజనేయులు నివాసానికి విచ్చేశారు. మంత్రి తమ ఇంటికి రావడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు స్థానిక టీఆర్ఎస్ నాయకులు వల్లెపు ఆంజనేయులు. అనంతరం ఏర్పాటు చేసిన తేనీటి విందుని మంత్రి స్వీకరించారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి వల్లెపు ఆంజనేయులుని అభినందిచారు.

కాగా వల్లెపు ఆంజనేయులు మాట్లాడుతూ… ‘మంత్రి మా నివాసానికి రావడంతో ఎంతో సంతోషంగా ఉంది. మంత్రిగారి ఆదేశాల మేరకు పార్టీ పటిష్టతకు మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మంత్రి నిరంజన్ రెడ్డిగారు ఎప్పుడు పిలిచినా అందుబాటులోనే ఉంటూ ఆయన ఆదేశాలను తప్పకుండా పాటిస్తాము” అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు, యువ నాయకుడు దండుగల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *