‘నిరుద్యోగ జంగ్ సైరన్’ను
విజయవంతం చేయాలి

- ఈనెల 8న హైదరాబాద్ సరూర్ నగర్ లో విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ బహిరంగ సభ..
- హాజరు కానున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత ప్రియాంక గాంధీ
- నిరుద్యోగ జంగ్ సైరన్ బహిరంగ సభకు యువలోకం కదిలి రావాలని పిలుపు
- ప్రభుత్వ వైఫల్యంతోనే పేపర్ లీకేజీలు, స్వరాష్ట్రంలోనూ యువకుల బలిదానాలు. దొమ్మటి సాంబయ్య
- విద్యను ప్రోత్సహిస్తూ ఫీసు రియెంబర్స్ మెంట్ తెచ్చిన కాంగ్రెస్.. నిరుద్యోగ బృతి ఇస్తామని మాట తప్పిన బిఆర్ఎస్. కవ్వంపల్లి సత్యనారాయణ.
కరీంనగర్ బ్యూరో, మే 4 (విశ్వం న్యూస్) : ఈనెల 8వ తేదీన ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన, తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న నిరుద్యోగ జంగ్ సైరన్ బహిరంగ సభను ఉద్దేశించి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ దొమ్మటి సాంబయ్య, డీసీసీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తామని, 2018 మానిఫెస్టో లో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 3016 రూ.ల నిరుద్యోగ బృతి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటి నుండి ఒక డాక్టర్ ను, ఒక ఇంజనీర్ ను తయారుచేసే విధంగా విద్యను ప్రోత్సహిస్తూ ప్రవేశపెట్టిన ఫీస్ రియెంబర్స్ మెంట్ పథకాన్ని అమలుచేస్తే నేడు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలంగాణ యువత గుర్తించాలని కోరుతున్నామని తెలిపారు. 1200 మంది యువకుల బలిదానాలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక లక్షా ఏడు వేల, ఏడువందల నలభై నాలుగు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పడం, హరీష్ రావు, ఇరువై అయిదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని చెప్పడం బిశ్వాల్ కమిటీ లెక్కల ప్రకారం ఒక లక్షా పదకొండు వేల ఒక వంద ముప్పై అయిదు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలిపి, ఎనిమిది సంవత్సరాల తరువాత కేవలం తొంభై ఒక వెయ్యి ఒకవంద నలభై ఏడు ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని ఇచ్చిన ఉద్యోగ ప్రకటనలకు సంసిద్దం అవుతున్న నిరుద్యోగులు తమ తల్లితండ్రులు ఆస్తులు అమ్ముకొని, లక్షల రూపాయలు కుమ్మరించి కోచింగ్ సెంటర్ల లో కష్టపడి చదువుతుంటే ఈ ప్రభుత్వం పేపర్ లీకేజీలలకు పాల్పడి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతుందన్నారు.
పారదర్శకత లేని ఈ అసమర్థ కెసిఆర్ ప్రభుత్వ పాలన వైఖరి వల్ల పేపర్ లీకేజీలతో అయోమయంలో ఉన్న 45 లక్షల మంది నిరుద్యోగ యువతకు అండగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న సరూర్ నగర్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థి నిరుద్యోగ యువతతో పాటు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ బహిరంగ సభను జయప్రదం చేయాలని పత్రిక ముఖంగా కోరుతున్నామని అన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాకు చెందిన అన్ని మండలాల బ్లాక్ మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరయ్యేలా అన్ని మండల కేంద్రాలలో పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరుద్యోగ యువత ఈ బహిరంగ సభలో స్వచ్ఛందంగా పాల్గొనే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడంతోపాటు ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరినారు.
ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, ఏండి తాజ్, మేనేని రోహిత్ రావు, పులి ఆంజనేయులు గౌడ్, పత్తి కృష్ణారెడ్డి, శ్రావణ్ నాయక్, వెన్న రాజ మల్లయ్య ,కొమ్మర బోయిన రవీందర్ రెడ్డి, సాహెబ్ హుస్సేన్, రామారావు, పురుమళ్ళ మనోహర్, కంది తిరుపతిరెడ్డి, బుచ్చయ్య, సాయిల్ల రాజు, తిరుపతి, కుర్ర పోచయ్య, కల్వల రామచందర్, బొబ్బిలి విక్టర్, నిహాల్ అహ్మద్, సలీముద్దీన్, కుంభాల రాజ్ కుమార్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, జీడి రమేష్, ఎస్ డి అజ్మత్, హరీష్ గౌడ్, వాసిం ,ఉరడి లత, పరదాల లింగమూర్తి, ఎర్ర శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.