దొమ్మటి సాంబయ్య గారిని కలిసిన
వీణవంక కాంగ్రెస్ నాయకులు

వీణవంక, మే 5 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ టిపిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య గారిని మర్యాదపూర్వకంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం కరీంనగర్ లో కలిసిన వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు వీణవంక మండల సమన్వయకర్తలు వన్నె రాజ మల్లయ్య, కల్వల రామచంద్రం, నాయకులు చదువు జైపాల్ రెడ్డి, కొల్లూరి సదానందం, ఈదునూరి పైడి కుమార్, కలసి సన్మానించడం జరిగింది.
అనంతరం ఈనెల 8వ తేదీన ఏఐసీసీ అగ్రనేత శ్రీమతి ప్రియాంక గాంధీ గారి తెలంగాణ పర్యటన, సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న నిరుద్యోగ జంగ్ సైరన్ బహిరంగ సభ అంశాలపై ప్రసంగించారు.