అప్పటికీ ఇప్పటికీ తెలంగాణలో చాలా మార్పు

అప్పటికీ ఇప్పటికీ తెలంగాణలో చాలా మార్పు

మాజీ మంత్రి టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు
హైద‌రాబాద్‌,జనవరి 6 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతోందని… అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని మాజీ మంత్రి టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు శుక్రవారం వరంగల్ భద్రకాళీ అమ్మవారిని, వేయిస్తంబాల దేవాలయాన్ని బాపిరాజు సందర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్‌ (Dasyam Vinay Bhaskar)తో కలిసి బాపిరాజు దంపతులు, కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… మిషన్ భగీరథ పథకం అద్భుతమని కొనియాడారు. ఇంటింటికీ నీరు అందించాలనేది వాజ్ పేయ్ కలా అని… అది తెలంగాణలో నెరవేరుతోందని తెలిపారు. వినయ్ భాస్కర్ కోరిక మేరకు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నామని అన్నారు. 1992లో వరంగల్ జిల్లా ఇంచార్జీ మంత్రిగా పనిచేశానని… సమ్మక్క సారలమ్మల జాతరకు రోడ్డు వేసే భాగ్యం కలిగిందని కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *