వివాహ వేడుకలో గెల్లు శ్రీనివాస్ సతీమణి

కమలాపూర్, మే 12 (విశ్వం న్యూస్) : కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన పిడిశెట్టి రమ-బాబు గార్ల కుమార్తె సౌమ్యశ్రీ-హరికృష్ణ గారి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి గెల్లు శ్వేత గారు.
ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండలం సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పెండ్యాల రవీందర్ రెడ్డి గారు, శంభునిపల్లి గ్రామ ఉపసర్పంచ్ కవిత-కుమార్ గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి గారు, మాజీ సర్పంచ్ బొల్లం రాజిరెడ్డి గారు, మాజీ సర్పంచ్ గోపాల్ గారు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బుచ్చిరెడ్డి గారు, సత్య రావు గారు, శంభునిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల చైర్మన్ బొల్లం తిరుపతి గారు, బిఆర్ఎస్వి నాయకులు ఆవుల తిరుపతి, క్రాంతి, తూర్పాటి భూపతి రాజు, సంతోష్, హరీష్, తదితరులు పాల్గొన్నారు.