
- గోవాలో ఎంజాయ్ చేస్తున్న చైర్మన్, వైస్ చైర్మన్ భర్త, కొందరు కౌన్సిలర్స్,కొందరు కౌన్సిలర్స్ భర్తలు
జమ్మికుంట, మే 19 (విశ్వం న్యూస్) : ఎర్రటి ఎండలో మహిళలు వైస్ చైర్మన్ వార్డ్ 19తో సహా 17, 18, 20 వార్డులలోని మహిళలు మా నీటి కష్టాలు చూడండి జమ్మికుంట చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ లు అంటూ ఎర్రటి 45 డిగ్రీల ఎండలో మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసన చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని నిరసనను విరమింపజేశారు.

మహిళలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారంటే ఎంత ఆవేదన ఉండి ఉండాలి. అలాంటిది ఎర్రటి ఎండలో మహిళలు నీటి బిందలతో రోడ్డుపై నిరసన చేస్తూ… ఓ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ చూడండి మా బాధ, మేము నీళ్ల కష్టాలతో మండే ఎండలో ఉన్నాం. మీరు ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తే వినే దూరంలో వారు లేరు పాపం మహిళలకు తెలియదు.

అసలు విషయం …నాలుగు రోజుల క్రితం ఏ.సి బస్సులో గోవా టూర్ కు జమ్మికుంట చైర్మన్, వైస్ చైర్మన్ భర్త, కొందరు కౌన్సిలర్స్, కొందరు మహిళా కౌన్సిలర్స్ భర్తలు వెళ్లారు. మా సమస్యలు పరిష్కారం చేయడానికి మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులు ఐన మీరు గోవాలో ఎంజాయ్ చేస్తారా.. ఎంటి ఇది అంటూ వాపోయారు.
ఈ నిరసన కార్యక్రమంలో మహిళలతో పాటు పాల్గొన్న యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ ఉపాధ్యక్షుడు సజ్జు మాట్లాడుతూ సుమారు నలుగురైదుగురు కౌన్సిలర్స్ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తున్నారని అన్నారు . అధికార ఎం.ఎల్.సి సత్వరంగా ప్రజా సమస్యలు గాలికి వదిలేసి గోవా వెళ్ళిన జమ్మికుంట ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గోవా వెళ్ళిన చైర్మన్, వైస్ చైర్మన్ భర్త, కౌన్సిలర్స్, మహిళా కౌన్సిలర్స్ యొక్క భర్తలపై పట్టణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది.
- వ్యయ ప్రయాసలకోర్చి డ్యూటీ చేస్తున్నప్రధానంగా… 24/7 డ్యూటీలో ఉండే శాఖలు
- వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖలు.
- ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకొనే అధికారం ఉంది. ప్రజా ప్రతినిదులు ప్రజల సమస్యలను నెరవేరుస్తూ మిగిలిన సమస్యలను ప్రణాళికా బద్ధంగా పరిశీలిస్తూ, వెసులబాటు కల్పించుకొని కుటుంబ పరంగా-బంధువుల పరంగా-స్నేహం పరంగా విహారానికి వెళితే ఎవరూ ప్రశ్నించరు.
- నీటి కష్టాలు ఉన్నప్పుడు పాలక వర్గంలో ప్రధాన వ్యక్తులు కూడా టూర్ కు వెళ్ళడం, అందులో ఇది వేసవి కావటం, నీటి కష్టాలు ఎదురవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడి రోడ్డుపై వచ్చి నిరసన తెలిపారు.