ఆదర్శంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఉండాలి

ఆదర్శంగా శానిటేషన్..
స్పెషల్ డ్రైవ్ ఉండాలి

చైర్మన్ రాజేశ్వర్ రావు, కమిషనర్ శ్రీనివాస్
జమ్మికుంట, మే 21 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణ పరిధిలోని 19 వార్డ్ లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ ను చైర్మన్ రాజేశ్వర్ రావు, కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ప్రధాన సమస్యలను చైర్మన్, కమిషనర్ కు చెప్పడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించినట్లు వార్డు ప్రజలు తెలిపారు.

నల్లా నీళ్ళు సక్రమంగా రాక పోవడం చాలా ఘోరమని, అలాగే స్మశాన వాటిక ప్రక్కన పెద్ద గోయి ఉందని దాని సమస్య గురించి కూడా విన్నవించుకోవడం జరిగిందని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, డి.బి.ఎస్ బ్యాంక్ ప్రక్క గల్లి రోడ్డు వెడల్పు, గురించి చైర్మన్ , కమిషనర్ కు విజ్ఞప్తి చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజేశ్వర్ రావు, కమిషనర్ శ్రీనివాస్, పారిశుద్ద కార్మికులు, బి.అర్.ఎస్ నాయకుడు కోటి, బి.జె.పి నాయకుడు రహీమ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *