మల్లికార్జున్ కుటుంబానికి అండగా ఉంటాం…
ట్విట్టర్లో స్పందించిన ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
గోవిందరావుపేట, జనవరి 9 (విశ్వం న్యూస్) : తెలంగాణ ఉద్యమం కోసం సర్వస్వం త్యాగం చేసిన గజ్జి మల్లికార్జున్ కుటుంబానికి అండగా ఉంటామని ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం బిఆర్ఎస్ పార్టీ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ గుండెపోటుతో హఠాత్ మరణం చెందాడు .దీంతో మల్లికార్జున్ కుటుంబానికి అండగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమకారులు గజ్జి మల్లికార్జున్ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ సర్వత్ర నెలకొన్నది. అన్ని పార్టీల నుండి అతని కుటుంబానికి పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తం చేశారు .ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెంటనే స్పందించి మల్లికార్జున్ కుటుంబానికి తాను వ్యక్తిగతంగా పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఆయన నిటిజన్లకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.