ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి, జనవరి 9 (విశ్వం న్యూస్) : ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ లు వి.లక్ష్మినారాయణ, కుమార్ దీపక్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను పరిశీిలన చేసి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ రోజు మొత్తం ( 73 ) అర్జీలు రాగా, అందులో రెవెన్యూ సంభందితమైనవి (65 ) ఉండగా, మిగతా శాఖలకు చెందినవి (8 ) ఉన్నాయి. పెద్దపల్లి మండలంలోని హనుమంతునిపేట గ్రామానికి చెందిన తీగెల మహెందర్ తమ గ్రామంలో ఉన్న పందుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, మండల పంచాయతీ అధికారికి రాస్తూ సమస్య పరిష్కరించి రిపోర్ట్ సమర్పించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి మండలం రంగంపల్లి గ్రామానికి చెందిన ఆరెపల్లి సంధ్యారాణి తమకు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, సెక్షన్ హెచ్ విభాగానికి రాస్తూ అర్హత పరిశీలించి జాబితా లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన దశరథం రాంబాబు 2021 లో మావోయిస్టుల నుంచి జనజీవన స్రవంతిలో కలిశానని, తనకు శ్రీరాంపూర్ మండలంలో రాతిపల్లి సర్వే నెంబర్ 676 లో ఉన్న ప్రభుత్వ భూమి కేటాయించి పునరావాసం కోరుతూ దరఖాస్తు చేసుకోగా, శ్రీరాంపూర్ మండల తహసిల్దార్ కు రాస్తూ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
పెద్దపల్లి మండలం రాంపల్లి శివారు ప్రాంత ప్రజలు ధర్మాబాద్ లోని ఖబరస్తాన్ ఆక్రమణకు గురవుతుందని పరిరక్షించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పెద్దపల్లి మండల తహసిల్దార్ కు రాస్తూ నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి కె.వై.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.