విలువలకు నిలువుటద్దం చొక్కారావు రాజకీయ జీవితం

విలువలకు నిలువుటద్దం
చొక్కారావు రాజకీయ జీవితం

  • నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా చొక్కారావు వర్ధంతి వేడుకలు
  • కూడలి అభివృద్ధి పనులు పూర్తికాగానే తిరిగి అక్కడే చొక్కా రావు విగ్రహం నెలకొల్పాలి
  • నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో, మే 28 (విశ్వం న్యూస్) : మూడు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా పలుశాఖలకు మంత్రిగా పనిచేసి విలువలకు నిలువుటద్దంగా నిలిచిన గొప్ప నాయకుడు జువ్వాడి చొక్కారావు అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ అన్నారు. చొక్కారావు వర్ధంతి వేడుకలు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు గల కూడలి అభివృద్ధి పనుల సందర్భంగా విగ్రహం తొలగించారని పనులు పూర్తయిన వెంటనే తిరిగి అక్కడే చొక్కారావు విగ్రహం నెలకొల్పాలని పేర్కొన్నారు. కూడలి వద్దనే చొక్కారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో వైద్యుల అంజన్ కుమార్, రహ్మత్ హుస్సేన్, గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, మడుపు మోహన్, శ్రవణ్ నాయక్, కుర్ర పోచయ్య, దన్న సింగ్, జీడీ రమేష్, షబానా మహమ్మద్, ఎండి చాంద్, ముక్క భాస్కర్, సలీమొద్దిన్, నాగుల సతీష్, మెతుకు కాంతయ్య, కీర్తి కుమార్, ముల్కల కవిత, అన్నే జ్యోతి, పద్మ, వంగల విద్యాసాగర్, దిలీప్ కుమార్, మహమ్మద్ భారీ,నదీమ్, సిరాజోద్దిన్, ఇమామ్, అజ్మత్ హనీఫ్, కమల్ కత్రి, రవీందర్ రావు, లింగన్న, ముల్కల యోనా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *