జమ్మికుంట:బీఆర్ఎస్ పార్టి
7వ వార్డు కమిటి నియామకం

చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో
జమ్మికుంట, మే 30 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణ పరిధిలోని 7వ వార్డులో మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు అధ్వర్యంలో 7వ వార్డు కౌన్సిలర్ పొనగంటి సారంగం అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టి 7వ వార్డు అధ్యక్షులుగా కాటిపెళ్లి మధుసూధన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మిడివెళ్లి నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.