నాడు ఎండిపోయిన చెరువులు…నేడు నిండు కుండల్లా చెరువులు

నాడు ఎండిపోయిన చెరువులు…
నేడు నిండు కుండల్లా చెరువులు

  • నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం..నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునర్జీవం.
  • మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం
  • తెలంగాణలో సంపద పెంచి పేదలకు పంచుతున్నాం
  • తెలంగాణ ప్రయోజనాలు కాపాడే ఏకైక నాయకుడు కెసిఆర్ మాత్రమే
  • తెలంగాణ పథకాలు – ఫలాలు నేడు దేశం మొత్తం కోరుకుంటున్నారు
  • రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ బ్యూరో, జూన్ 8 (విశ్వం న్యూస్) : సమైక్య రాష్ట్రంలో నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం కాగా నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునర్జీవం పోసుకొని మండు వేసవిలో మత్తళ్లు దుంకుతున్నయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో బాగంగా గురువారం సాగునీటి దినోత్సవం సందర్భంగా ఊరూరా చెరువు పండగ కార్యక్రమంలో మంత్రి గంగుల పలు గ్రామాల్లో పాల్గొన్నారు. మొదట కరీంనగర్ రూరల్ మండలంలోని చామన పల్లి గ్రామంలో అప్పనపల్లి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్నగర్ లో చెరువుల పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో మంత్రి గారికి స్వాగతం పలకగా మంత్రి గారు స్వయంగా బతుకమ్మ ఎత్తుకొని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

నాడు పల్లెల్లో ఎక్కడ చూసినా ఎండిపోయిన చెరువులు.. నేర్రెలు బారిన పొలాలు కనిపించేవని, ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేడు గ్రామాల్లోనీ చెరువుల్లో మండు వేసవిలో మత్తల్లు దుంకుతున్నాయని అన్నారు. మన మిషన్ కాకతీయ నేడు దేశానికే ఆదర్శం అయ్యిందని, తెలంగాణ పథకాలు ఫలాలు నేడు దేశం మొత్తం కోరుకుంటున్నారనీ అన్నారు.
ఆనాడు సమైక్య పాలనలో పక్కనే గోదావరి పారినా… మన పొలాల్లోకి చుక్కా నీరు రాని పరిస్థితి ఉండేదని, రైతులు వ్యవసాయం చేయాలంటే ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితులు ఉండేవనీ గుర్తు చేశారు.

ఆనాడు సాగు పెట్టుబడి కోసం అప్పులు చేసే దుస్థితి ఉండేదని, వర్షం పడితే పంట పండేది లేకపోతే ఎండేదనీ ,పంట దిగుబడి రాక… అప్పులు చెల్లించలేక… అప్పుకు అప్పై… వడ్డికి మిత్తై… చివరకు వ్యవసాయం భూములను అమ్ముకున్న పరిస్థితి ఉండేదని అన్నారు.సమైక్య పాలకులు ఇక్కడి నీరు… బొగ్గు… కరెంటు… సంపదను దోచుకున్నారనీ అన్నారు. సాగునీటి కోసం గ్రామాల మధ్య నీటి యుద్ధాలు జరిగిన రోజులు గుర్తున్నాయనీ, ఎరువుల కోసం లైన్లో చెప్పులు పెట్టి రోజుల తరబడి ఎదురుచూసి… చివరకు పోలీసుల చేతుల్లో లాటి దెబ్బలు తిన్న రోజులు ఉండేవని అన్నారు. ఆరు దశాబ్దాల సమైక్య పాలనలో సాగు కోసం అరిగోస పడ్డమని, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ప్రభుత్వాలు మారాయే తప్ప గ్రామీణ ప్రాంతాల ప్రజల బతుకులు మారలేదనీ అన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కోటి రూపాయలు కావాలని నాటి సీఎం లని అడిగితే… వెకిలిగా నవ్వారే తప్ప ఒక్క రూపాయి ఇవ్వలేదనీ,మన నీరు… మన నిధులు… మన బొగ్గు… మన కరెంటు… మనకు కావాలంటూ సీఎం కేసీఆర్ పోరాడి తెలంగాణను సాధించారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి కాలేశ్వరం జలాలతో మండుటెండల్లో చెరువులు మత్తడి దూకిస్తున్నామని అన్నారు. ప్రతి ఇంచు భూమికి సాగు నీటిని అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసామని, గతంలో నీళ్లు ఉన్నప్పటికీ… రైతులకు ఇవ్వాలన్న మనసు సమైక్య పాలకులకు రాలేదనీ అన్నారు.

కాలేశ్వరం జలాల రాకతో… తెలంగాణలో భూమి పెరగకున్నా… సాగు విస్తీర్ణం పెరిగి… భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయన్నారు. సాగు పెట్టుబడి కోసం రైతుబంధు కార్యక్రమాన్ని సియం కెసిఆర్ చేపట్టారనీ,రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, దేశంలో పండిన ప్రతీ గింజను కొనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.ఇది ఎన్నికల సంవత్సరం అని మళ్లీ ఒక అవకాశం ఇవ్వండి అంటూ కాంగ్రెస్ బిజెపిలు మళ్ళీ వస్తున్నాయనీ,బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రిమోట్ ఢిల్లీ నాయకుల వద్ద ఉంటే కెసిఆర్ కు మాత్రం తెలంగాణ ప్రజలే రిమోట్ అని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ వారికి అవకాశం ఇస్తే మళ్లీ ఇక్కడి బొగ్గు… నీరు… కరెంటు సంపదను దోచుకుని తెలంగాణను గుడ్డి దీపం చేస్తారనీ ఆందోళన వ్యక్తం చేశారు. మనం పడిన కష్టం భవిష్యత్ తరాలు పడొద్దంటే అభివృద్ధి కొనసాగాలనీ… తెలంగాణ ప్రయోజనాలను కాపాడే కెసిఆర్ చేతులను బలోపేతం చేయాలనీ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *