అర్హులైన పేదలకు డబుల్బెడ్ రూమ్ ఇండ్లు వెంటనేకేటాయించాలి:వాసుదేవరెడ్డి

అర్హులైన పేదలకు డబుల్
బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే

కేటాయించాలి:వాసుదేవరెడ్డి

హుజురాబాద్ ఆర్సి, జూన్ 16 విశ్వంన్యూస్ : హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరు వాసుదేవరెడ్డి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు,ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అరులైన పేదలను గుర్తించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచడంలో పూర్తిగా విఫలమైందన్నారు .అర్హులైన పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని,ఇంటి స్థలం లేని పేదలను గుర్తించి 120 గజాల స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
గూడు కోసం ప్రభుత్వ భూములను ఆక్రమించి గుడిసెలు వేసుకున్న ప్రతి అర్హులైన నిరుపేద కుటుంబానికి 120 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయాలని,ప్రభుత్వ నిర్బంధ కాండను ఆపాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18 నుండి 27 వరకు జరిపే బస్సు యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 19న తాసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు.

వేల ఎకరాల భూములను ప్రభుత్వ అధికారుల పట్టించుకోకపోగా, ఇంటి నీడ కోసం 60 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే నిర్బందించడం దుర్మార్గమన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతి 2016 ఇస్తామని ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్న అతి గతి లేదన్నారు.
ఆచరణ రూపం దాల్చని అనేక పథకాలు వాగ్దానాలు ఇస్తున్నప్పటికీ అమలుకు నోచుకోకపోవడం ఏకకాలంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయకపోవడం మూలంగా రైతులు వడ్డీలు చెల్లించలేక, కొత్త రుణాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 10000రూ!!నష్టపరిహారం చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి మాటలు నేటికీ అమలకు నోచుకొక రైతాంగం ఎదురుచూస్తున్నారు అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్య,ప్రగతిశీల వర్గాలను ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతులను ఈ డి, సి బి ఐ,ఐటి సంస్థలను ఉపయోగించుకుంటూ దుర్వినియోగం చేస్తుందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ వాగ్దానం నీటి మూటలే అయిందన్నారు.

అదాని అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతుందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్పొరేట్లకు,పెట్టుబడుదారులకు, ధనవంతులకు ఊడిగం చేస్తున్నారన్నారు. జమ్మికుంట ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతుందని చేతులు తడపంది ఏ పని కావడం లేదని ప్రజానీకం బహిరంగంగా ఆరోపిస్తున్న పాలకులు ఎంత మాత్రం చర్యలు తీసుకోకపోవడం వల్ల వారి నిజాయితీని శంకించాల్సి వస్తుందన్నారు.గతంలో ఇసుక ట్రాక్టర్కు 1000రూ!!ఉండగా నేడు ఇసుక ట్రిప్పుకు 5000రూ!! వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోదారులకు అందుబాటులో ఉండాల్సినటువంటి ఇసుకను పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ డబ్బులు గడిస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అక్రమ వ్యాపారులకు ఊతమివ్వడం సిగ్గుచేటు అన్నారు.ఇప్పటికైనా ఇసుక అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామన్నారు.
ఈ సమావేశంలో పార్టీ జోన్ కార్యదర్శి శీలం అశోక్, జోన్ కమిటీ సభ్యుడు కొప్పుల శంకర్, చెలుపురి రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *