మేడ్చల్ జిల్లా ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల
పూర్తిస్థాయి కమిటీ నియామకం
ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు
గుండ్ల కుమారస్వామి హాజరు
బోడుప్పల్, జూన్ 16 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ పరిధిలోని మల్లాపూర్ అంబేద్కర్ భవన్ లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అధితిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వర్కింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కన్వీనర్ గుండ్ల కుమార స్వామి హాజరయ్యారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో దళిత గిరిజనుల జర్నలిస్టుల హక్కుల కోసం కలిసి రావాలని కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా జర్నలిస్ట్స్ కమిటీ కోశాదికారిగా కూరెళ్ల ఉపేంధర్, జాయింట్ సెక్రటరీ గా ఎల్ కిరణ్ నాయక్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకులు కిరణ్ నాయక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల హక్కుల కోసం ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కోశాధికారి కురెళ్ళ ఉపేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుకు దళిత బంధు, గిరిజన బంధు, ఇండ్ల స్థలాల పట్టాలు,డబుల్ బెడ్ రూంస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎల్లా సంతోష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాస్,జిల్లా సలహాదారులు పాపా రావు, దినేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.