హుజురాబాద్ లో ఘనంగా
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

హుజురాబాద్ ఆర్సి, జూన్ 19 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు,భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించడంతో పాటు రాహుల్ గాంధీ జన్మదినన్ని పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించగా యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు,కొల్లూరి కిరణ్ జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, మైనార్టీ టౌన్ అధ్యక్షుడు అప్సర్, ఇతర గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.