కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను శవయాత్ర నిర్వహించి చెప్పులతో దాడి చేసి దహనం చేశారు

కరీంనగర్, జూన్ 24 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో పాడి కౌశిక్ రెడ్డి విలేఖరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గన్నేరువరం మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పోచయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను శవయాత్ర నిర్వహించి చెప్పులతో దాడి చేసి దహనం చేశారు.

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పోచయ్య మాట్లాడుతూ నీవు ఈరోజు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నావు కాబట్టి బిఆర్ఎస్ వైపు మాట్లాడుతున్నావు. పదవి ఇవ్వక ముందు నువ్వు ఎక్కడున్నావు మీ రాజకీయాల కోసం మా కులాన్ని మమ్మల్ని తక్కువచేసి మాట్లాడితే రాబోవు కాలంలో తగిన బుద్ధి చెబుదామని హెచ్చరించారు.

  • వెంటనే క్షమాపణ చెప్పకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతాం మా ముదిరాజ్ కులస్తులం 50% ఓట్లు కలిగి ఉన్నాం తగిన బుద్ధి చెపుతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *