బిజిగిరి షరీఫ్ ఉర్సు ఉత్సవంలో అపశృతి:కోనేరులో పడి ఇద్దరు మృతి

జమ్మికుంట:బిజిగిరి షరీఫ్
ఉర్సు ఉత్సవంలో అపశృతి:
కోనేరులో పడి ఇద్దరు మృతి

హుజురాబాద్ ఆర్సి, జూన్ 30 (విశ్వం న్యూస్) : హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ సయ్యద్ అంకుషావలి దర్గా వద్ద బక్రీద్ సందర్భంగా ప్రతి ఏటా ఉర్సు ఉత్సవాలు అనువాయితీగా జరుపుతున్నారు. ఈ ఉత్సవాలకి గోదావరిఖని నుండి వచ్చిన తొమ్మిది మంది యువకులు దర్గా సమీపంలో ఉన్న కోనేరులోకి ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఇద్దరు కోనేరులోనే చిక్కుకొని మరణించారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి చెందిన తొమ్మి మంది స్నేహితులు గురువారం రాత్రి దర్గాలో దర్శనం కోసం బిజిగిరి షరీఫ్ దర్గా వద్దకు వచ్చి శుక్రవారం ఉదయం మొక్కు చెల్లించుకున్నారు.

ఈ క్రమంలో దర్గా సమీపంలో ఉన్న కోనేరులో స్నానం చేసేందుకు వెళ్లరు. సాయికుమార్ (24), శ్రీనాథ్ (19) అనే ఇద్దరు యువకులు కోనేరులో పడి మృతి చెందగా మిగతా ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ టీంతో మృతదేహాలను బయటకు తీయించారు. అయిందాల రాజనర్సు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ బరపటి రమేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *