గ్రీన్ హిల్స్ కాలనీ: భూగర్భ డ్రైనేజీ,
సీసీ రోడ్ల గురించి వైస్ చైర్మన్
పద్మారావు పట్టించుకోరా..?
- మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ దుండిగల్ మున్సిపల్ కమీషనర్ కి వినతి పత్రం అందజేత
దుండిగల్, జూలై 1 (విశ్వం న్యూస్) : గ్రీన్ హిల్స్ కాలనీలో మిగిలి ఉన్న 1600 మీటర్ల భూగర్భ డ్రైనేజీ మరియ రోడ్ల మరియు మౌలిక వసతుల గురించి కాలనీ వాసులతో కలిసి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ దుండిగల్ మున్సిపల్ కమీషనర్ కి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ గ్రేటర్ కి అనుకోని వున్నా గ్రీన్ హిల్స్ కాలనీ లో మౌలిక వసతులు లేక కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉందన్నారు.
గ్రీన్ హిల్స్ కాలనీ సమస్యలపైన స్వయంగా కలెక్టర్ ఎండార్స్ చేసి కమీషనర్ కి పంపించిన కూడా సమస్యని బుట్ట దాఖలు చేయడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు నిస్పక్షపాతంగా వ్యవరించాలని కోరారు. కాలనీ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాసులు మాట్లాడుతూ కాలనీ లో 3000 జనాభా మరియు 1000 ఓటర్లు వున్నా కూడా స్థానిక కౌన్సిలర్ మరియు దుండిగల్ వైస్ చైర్మన్ అయిన తుడుం పద్మారావు పట్టించుకోవడం లేదని, అలాగే ఇదే విషయం పైన కలెక్టర్ గారిని కూడా కలిసి మా బాధను విన్నవించుకున్నా మా సమస్య కి పరిష్కారం లభించడం లేదని అన్నారు.