పిల్లలు, యువకులు గాలిపటాలు ఎగురవేయటంలో జాగ్రత్తలు తీసుకోవాలి

తల్లిదండ్రులకు సూచనలు ఇస్తున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి
అంబర్పేట్, జనవరి 13 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగరవేయడం జరుగుతుంది తల్లిదండ్రులు తమ పిల్లలకు యువకులకు గాలిపటాల వెంబడి పరిగెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కరెంటు వైర్లకు ఉన్న గాలిపటాలను తీయడానికి ప్రయత్నించవద్దని రైలింగ్ గోడలు లేని భవనాలపై గాలిపటాలు ఎగురవేయడానికి వెళ్లకూడదని జాగ్రత్తలు తల్లిదండ్రులు తెలియజేయాలి.జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు జరగకుండా ప్రయత్నిద్దాం అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి అన్నారు.