కరీంనగర్ గౌడ సంఘం కులస్తుల ఆషాడ మాసం వనభోజనాలు

కరీంనగర్ గౌడ సంఘం కులస్తుల
ఆషాడ మాసం వనభోజనాలు

కరీంనగర్ బ్యూరో, జూలై 7 (విశ్వం న్యూస్) : శుక్రవారం రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ ప్రాంగణంలో కరీంనగర్ గౌడ సంఘం కులస్తుల సమావేశం ఆలయనిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ గౌడ కుల బాంధవులందరికీ ఆహ్వానం ఆషాడ మాసం సందర్భంగా కరీంనగర్ బైపాస్ రోడ్ లో గల శ్రీరేణుక ఎల్లమ్మ దేవి గుడి ఆవరణలో కరీంనగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో జూలై 16 ఆదివారం రోజున వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి తీర్మానించడం జరిగినది. పిల్లలకు, స్రీలకు ప్రత్యేక ఆటపాట, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన పిల్లలకు, స్రీలకు బహుమతి ఇవ్వబడుతుందని ఈ  వనభోజన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వచ్చి అందరితో కలిసి ఆటపాటలతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి కుటుంబం  (500/-) ఐదు రూపాయలను నగదు లేదా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లించి జూలై 14 వ తేదీలో గా మీ పేర్లను నమోదు చేయించుకోవాలని తెలిపారు.

సెల్ నంబర్లు : బత్తిని సత్యం గౌడ్ 9440971728, నాగుల కిరణ్ కుమార్ గౌడ్ 9440304008, జూలై 16 ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుండి ఆలయ ఆవరణలో ఆటపాట, వినోద కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని గౌడ సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12:30 నుండి అందరికీ వెజ్, నాన్వెజ్ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కోడూరి మహేంద్ర గౌడ్, తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, పంజాల సురేందర్ గౌడ్, బుర్ర పరశురాం గౌడ్, వడ్లకొండ సత్తన్న, కోడూరి శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, బత్తిని రాజు, బత్తిని సత్యం, బత్తిని చంద్రయ్య, సుధగోని లక్ష్మీనారాయణ, సుదగోని ఆంజనేయులు, కోడూరి రాజేశం, కోడూరి హరికృష్ణ, కోడూరి సంపత్, కోడూరి లక్ష్మణ్, పైడిపల్లి నరేష్, గంగారపు లక్ష్మణ్, నాగుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *