రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు
నిరసనగా దిష్టిబొమ్మ దహనం

జమ్మికుంట, జూలై 12 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కండిస్తు ఈరోజు స్థానిక బస్టాండ్ సమీపన మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు అధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసి రేవంత్ రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రైతుల పక్షాన నిలిచి ఏకైక పార్టీ బి ఆర్ ఎస్ అంటూ నిరంతరం రైతుల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని కొనియాడాడు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ దేశినీ కోటి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్, కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.