
- తెలంగాణ స్టేట్ టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం, సిఎస్ కు విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 18 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ ను నియమించాలని తెలంగాణ రాష్ట్ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సి కమిషన్ వేయడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా రెండవ పీఆర్సీ కమిషన్ కమిటీని నియమించలేదు కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో రెండో పీఆర్సీ కమిషన్ వేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు వెంటనే చర్యలు చేపట్టాలని అందుకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల నుండి నలుగురు మంత్రులను నియమించి తెలంగాణ రాష్ట్రంలో పదవి విరమణ పొంది ఉన్న ఐఏఎస్ అధికారులతో రెండో పీఆర్సీ కమిషన్ కమిటీని నియమించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంత కుమారి ఐఏఎస్ లకు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
ఎందుకంటే ఐదు నెలలలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జూలై 30 లోపే 2వ పీఆర్సీ కమిషన్ కమిటీని వెంటనే నియమించి ప్రభుత్వ ఉద్యోగులకు ఐ ఆర్ మభ్యంతర భృతి వెంటనే ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ వెయ్యి కళ్ళతో పీఆర్సీ కమిషన్ కమిటీని వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నియమిస్తారని ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలో మొదటి పీఆర్సీ గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తోందని, ప్రభుత్వం వెంటనే రెండో పీఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 2023 నుంచి మధ్యంతర భృతిని పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ టీచర్లకు రెగ్యులర్ స్కేళ్లను రెగ్యులరైజ్ చేసి పే స్కేళ్లను వర్తింపజేయాలన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శలు చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జూలై నెలతో పీఆర్సీ కమిషన్ గడుపు ఉంది కనుక వెంటనే జులై నెల చివరిలోపే రెండవ పిఆర్సి కమిషన్ కమిటీని వెంటనే నియమించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు రెండ పీఆర్సీ కమిషన్ కమిటీని వెంటనే నియమిస్తారు కావచ్చు అని ఎదురుచూస్తున్నారు.
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంలో వచ్చి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కొరకు మంజూరు చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు స్కీంలను ప్రతి ఒక్కటి పేద ప్రజలకు అందినట్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో పని చేసినారు కనుక అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంత కుమారి ఐఏఎస్ చొరవ తీసుకొని రెండో పీఆర్సీ కమిషన్ కమిటీని జూలై నెలలోనే నియమించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతా కుమారి ఐఏఎస్ లకు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.