అకాల వర్షాలవల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి

అకాల వర్షాలవల్ల నష్టపోయిన
రైతులను వెంటనే ఆదుకోవాలి

  • సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి

జమ్మికుంట, జూలై 31 (విశ్వం న్యూస్) : జమ్మికుంట స్థానిక మోత్కులగూడెం చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టంతో పాటు ఇండ్లు కూలిపోయాయని వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

సాధారణ వర్షపాతం కంటే అధిక వర్ష పాతంతో పాటు లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తివేయడం, కల్వల ప్రాజెక్టు తెగిపోవడం కొన్ని చెరువుల మత్తడులు తెగిపోవడం మూలంగా మానేరు నది ప్రవాహం అధికం కావడం వలన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన చెక్ డ్యాములు కొట్టుకపోవడం మూలంగా పెద్ద ఎత్తున వేలాది ఎకరాల్లో పంటలకు ఇసుకమేటలు పెట్టాయని అన్నారు.

ఇసుక మేటలు పెట్టిన ప్రాంతాలను రెవెన్యూ అధికారులు సర్వే చేసి రైతులకు అద్దులు నిర్ణయించి పంట నష్టపోయిన రైతంగానికి ఎకరానికి 30 వేల రూపాయల చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇండ్లు కూలిపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గృహలక్ష్మి పథకం కింద వెంటనే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వేసిన పంటలు అధిక వర్షాలతో కొట్టుకుపోయాయని వరి వేసిన రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది అన్నారు. వరదల కారణంగా తెగిన చెరువుగట్లను చెక్ డ్యాములను వెంటనే పునర్ నిర్మించాలని, రహదారులను వెంటనే మరమ్మతులు చేయించాలని అన్నారు.

రాష్ట్రంలో భారీ వర్షాలతో సాగుచేసిన వరి,పత్తి మొక్కజొన్న, మిరప తోటలు, కూరగాయ తోటలు 10 లక్షల ఎకరాల పంటలు కొట్టుకుపోయాయని వెంటనే ఈ రైతంగానికి విత్తనాలు ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలన్నారు.ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన సమయంలో పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఉంటే కొంత వరకురైతులకు ఉపశమనం దక్కేది అన్నారు. ఇప్పటికైనా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జోన్ కార్యదర్శి శీలం అశోక్, రాము, దొండిగారు సతీష్, కిషోర్, శ్రీకాంత్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *