కోల ఆదిత్య జ్ఞాపకార్ధం పాఠశాలకు భారీ విరాళం

కోల ఆదిత్య జ్ఞాపకార్ధం
పాఠశాలకు భారీ విరాళం

కోల అన్నారెడ్డి
తిమ్మాపూర్, ఆగస్టు 3 (విశ్వం న్యూస్) : కరీంనగర్ రేకుర్తి లయన్స్‌ కంటి ఆసుపత్రి కమిటి బాధ్యులు, రెడ్‌క్రాస్‌ సోసైటి సభ్యులు, సరస్వతి శిశుమందిర్‌ అభివృద్ది కమిటి కార్యదర్శి ఇంజనీర్‌ కోల అన్నారెడ్డి తనయుడు ఆదిత్య గత సంవత్సరం కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాధంలో మరణించిన విషయం పాఠకులకు విధితమే, కాగా తనయుడి జ్ఞాపకార్ధం తల్లిదండ్రులు కోల లావణ్య-అన్నారెడ్డి దంపతులు గురువారం కరీంనగర్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో నూతనంగా నిర్మిస్తున్న భవనంలో తరగతి గది నిర్మాణానికి రూ. 8లక్షలు విరాళంగా అందజేసి వారి ఉదారతను చాటుకున్నారు.

ఈ సందర్భంగా అన్నారెడ్డి మాట్లాడుతూ.. తమ కుమారుడు ఆదిత్య అకాల మరణం తమ జీవితాల్లో చీకట్లు నింపినప్పటికి పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఆదిత్య పేరున తరగతి గది నిర్మాణానికి ఈ విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.

రూ. 8లక్షల చెక్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజమౌళికి అన్నారెడ్డి అందించగా స్కూల్‌ అభివృద్ది కమిటి అధ్యక్షులు బల్మూరి కరుణాకర్‌ రావు, ఎలగందుల సత్యనారాయణ, పాక పావన కృష్ణ, డా. ఎలగందు ల శ్రీనివాస్, స్కూల్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *