బీఆర్ఎస్ కు బీజేపీ బి టీమ్ కాబట్టే ఫిర్యాదు చేస్తలేరు

బీఆర్ఎస్ కు బీజేపీ బి టీమ్
కాబట్టే ఫిర్యాదు చేస్తలేరు

  • ఎంపి బండి సంజయ్ కుమార్, బీజేపీ కార్పొరేటర్లు స్మార్ట్ సిటీ నాసిరకం పనులపై ఎందుకు స్పందిస్తలేరు
  • కేంద్ర స్మార్ట్ సిటీ ప్రతినిధి సూర్య శ్రీనివాస్ పనులు భేష్ గా ఉన్నాయన్న దాన్ని మీరు ఏకీభవిస్తారా
  • నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో, ఆగస్టు 4 (విశ్వం న్యూస్) : నగరంలో స్మార్ట్ సిటీ పనులు నాణ్యత లోపంతో అశాస్త్రీయంగా జరుగుతున్నాయని ఎన్నో సార్లు నగర కాంగ్రెస్ క్షేత్ర స్థాయికి వెళ్లి పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించు కోలేదని ఇప్పుడు కూడా ఆధారాలతో సిద్దంగా ఉన్నామని కేంద్ర స్మార్ట్ సిటీ ప్రతినిధి మాత్రం కితాబు ఇస్తున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు.

నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రతినిధికి బిజెపి కార్పొరేటర్లు ఎందుకు ఫిర్యాదు చేయలేదని పనులు నాణ్యత లోపం లేకుండా భేష్ గా ఉన్నాయన్న దాన్ని మీరు సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. టవర్ సర్కిల్ వద్ద దెబ్బ తిన్న ఫుట్ పాత్ ఫోటోలు విద్యా నగర్ లో కొన్ని ఇండ్ల మటుకు రోడ్డు వెడల్పు తగ్గించి ఫుట్ పాత్ వేయకుండా వదిలేసిన ఫోటోలు ఎన్టీఆర్ ఆటోనగర్ లో మురికి కాలువకు అడ్డంగా డంప్ యార్డ్ వెళ్ళే రోడ్డు వేసిన ఫోటోలు నరేందర్ రెడ్డి ప్రదర్శించారు.

ఇప్పటికయినా స్థానిక ఎంపి బండి సంజయ్ కుమార్ కు చిత్తశుద్ధి ఉంటే నాసిరకం పనులపై సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. రెండు నెలల క్రితం టవర్ సర్కిల్ ప్రాంతంలో స్మార్ట్ సిటీ పనుల నాణ్యత లోపంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ కుమార్ కేంద్ర స్మార్ట్ సిటీ అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదని బిఆర్ఎస్ కు బి టీమ్ కబట్టేనా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విలేఖరుల సమావేశంలో దన్న సింగ్, ఎండి చాంద్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జిలకర రమేష్, మామిడి సత్యనారాయణ రెడ్డి, కంకణాల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *