ఢిల్లీ:అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం చేసి శేజాల్ నిరసన

ఢిల్లీ, ఆగస్టు 4 (విశ్వం న్యూస్) : గత 6 నెలలుగా ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్య నాకు చేసిన అన్యాయానికి నిరసనగా న్యాయం కోసం హైదరాబాద్ గల్లి నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానిస్తూ నా పౌర హక్కుల కు భంగం కలిగించేలా నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.

గత 6 రోజులుగా నేను ఢిల్లీ లో నీ పార్లిమెంట్ భవన్ ముందు న్యాయం కోసం నిరసన దీక్ష చేస్తూ తెలంగాణ ఎమ్ పి ల అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా నాకు కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదు. మణిపూర్ మహిళపై జరిగిన దాడులకు బి జె పి ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టిన బి ఆర్ ఎస్ ఎమ్ పి లు మరియు పార్టీ బి ఆర్ ఎస్ ఎమ్ ఎల్ ఏ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు.

టీ (బీ) ఆర్ ఎస్ ఎం పి లకు స్వ రాష్ట్రానికి చెందిన నేను గుర్తుకు రావడం లేదా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికై ఈరోజు మహిళలకు అన్యాయం చేస్తూ కామ పిశాచి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కాపాడాలని ప్రయత్నం చేస్తున్నందుకు నిరసనగా, రాజ్యాంగంలో మహిళా రక్షణ కోసము చేసిన చట్టాలు అమలు చెయ్యాలి అని ఢిల్లీలో ని తెలంగాణ భవన్ లో గల డా: బీ ఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పాలభిషేకం చేసి నేడు శేజల్ నిరసన తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *