గురుకులాల్లో దళిత విద్యార్థులకు సీట్లు పెంచాలి

గురుకులాల్లో దళిత విద్యార్థులకు
సీట్లు పెంచాలి:డా.రసమయి

  • అసెంబ్లీలో గళం వినిపించిన డా.రసమయి

తిమ్మాపూర్, ఆగస్టు 4 (విశ్వం న్యూస్) : దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో మెరుగైన విద్యను అందించాలనే సంకల్పంతో సి.ఏం కేసీఆర్ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రస్థావించారు.

గురుకుల పాఠశాలలో సీట్లు సరిపోవ డం లేదని, ప్రభుత్వం సీట్ల సంఖ్య పెంచడంతో పాటు గురుకుల సీటు కోసం దరఖాస్తులు చేసుకున్న దళిత విద్యార్థులకు తప్పకుండా సీటు ఇవ్వాలని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. గురుకుల పాఠశాలలో సీటు వస్తే విద్యార్థుల తల్లిదండ్రులు పండుగ చేసుకుంటు న్నారని, ప్రభుత్వం సీట్ల సంఖ్య పెంచాలని కోరారు.

గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మాణం చేయించాలని, మానకొండూర్ నియోజకవర్గములో
6 గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో గురుకుల సీట్ల కోసం పోటీ పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం సీట్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు చాలా మంది మెడికల్ కళాశాలల్లో, ఐఐటీలో సీట్లు సాధిస్తున్నారని, అమెరికా వంటి ఉన్నత దేశాలకు వెళ్తున్నారని, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందుతుందని ఎమ్మెల్యే రసమయి సభలో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *