దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో
మహబూబ్ నగర్, ఆగస్టు 13 (విశ్వం న్యూస్) : దేశంలో మొట్టమొదటి సారిగా జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నా అతిపెద్ద డ్రోన్ షో ను తెలంగాణ టూరిజం అధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో ట్యాంక్ బండ్ పై రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
ఆనంతరం ట్యాంక్ బండ్ పై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి, టూరిజం MD మనోహర్, జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, SP నరసింహ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, DCCB వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ కౌన్సిలర్ల, ఇతర ప్రజాప్రతినిధులు, వేలాది మంది ప్రజలతో కలసి డ్రోన్ షో ను తిలకించారు.
450 డ్రోన్లతో ఈ కింది ప్రదర్శనలు కొనసాగాయి…
- తెలంగాణ మరియు మహబూబ్ నగర్ మ్యాప్
- కోహినూర్ వజ్రం
- కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్
- పిల్లలమర్రి
- సస్పెన్షన్ బ్రిడ్జ్
- శిల్పారామం
- ఐటీ టవర్
- జోగులాంబ దేవాలయం
- మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ముఖ్యమంత్రి కెసిఆర్
- జై భారత్, జై తెలంగాణ
- మన మహబూబ్ నగర్