నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి
వేడుకలో గవర్నర్, సీఎం

హైదరాబాద్, ఆగస్టు 25 (విశ్వం న్యూస్) : తెలంగాణ సచివాలయ ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయ ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లపోచమ్మ ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.
సెక్రటరియేట్ లో నల్ల పోచమ్మ దేవాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్, అనంతరం చర్చికి కూడా ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత సీఎం గారు మసీదును ప్రారంభించారు.









