వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల
సమస్యలను పరిష్కరించండి

- తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టి.కె.శ్రీదేవికి విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 30 (విశ్వం న్యూస్) : తెలంగాణ స్టేట్ లో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యలు, 317 జీవో ప్రకారం బదిలీ అయిన ఉద్యోగులకు వారు కోరుకున్న ప్రాంతాలకు డిప్టేషన్ ఆర్డర్ ఇచ్చి వారికి బదిలీ చేయాలని, శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా వచ్చినట్లు ప్రయత్నం చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగులకు బదిలీలు చేయాలని, వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఏ సి టి ఓ లకు సీనియార్టీ లిస్టును వెంటనే అమలుపరిచినట్లు చూడాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘ నాయకులు ఎస్.కె జలాలుద్దీన్, జి ప్రభాకర్, జి శ్రీనివాస్, రాఘవేంద్ర, సునీల్, జగదీష్, విక్టర్ పాల్, మూర్తి, రవీందర్ రెడ్డి అజయ్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ టి కె శ్రీదేవి కి రిప్రజెంటేషన్ అందించడం జరిగింది.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని కమిషనర్ డాక్టర్ టి.కె శ్రీదేవి ఉద్యోగ సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం 2024 సంవత్సరానికి సంబంధించిన టేబుల్ క్యాలెండర్ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ టీ కే శ్రీదేవి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీదేవి ఇస్తున్న ఆదేశాలను తూచా తప్పకుండా అమలు పరుస్తాం ప్రభుత్వ ఖజానాకు రెవిన్యూ రావడానికి మా వంతు రాత్రి పగలు పనిచేస్తాం. తెలంగాణ స్టేట్ లో వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ టి కె శ్రీదేవి పేరును ఉన్నత అధికారులు గుర్తించే విధంగా మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వాగ్దానం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీమతి జే కామేశ్వరి, శ్రీమతి సునీత కాశి, జాయింట్ కమిషనర్ శ్రీ లీల, శ్రీమతి లావణ్య రవి, శ్రీమతి కవిత వీరి అందరికి నూతన సంవత్సరం క్యాలెండర్లను అందజేసి నూతన సంవత్సరము శుభాకాంక్షలు తెలిపారు.
