ముస్లింమైనార్టీలకు సీఎం
ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

- తెలంగాణ స్టేట్ 33 జిల్లాల జమాత్ ఉలేమా సంఘ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ పీర్, షబ్బీర్ అహ్మద్, సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విశ్వం న్యూస్) : ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన ప్రవక్తకు ఎవరైనా అవమానపరిచినట్లు మాట్లాడినట్లయితే అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అలాంటి జీవో జరగబోయే శాసనసభ సమావేశంలో తీసుకొని రావాలని తెలంగాణ స్టేట్ జమాత్ ఉలేమా సంఘం తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములను ఎవరు కూడా ఆక్రమణ చేసిన వక్ఫ్ బోర్డుకి స్థలాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని మరియు ఇకముందు కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములను ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని శనివారం రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో తెలంగాణ స్టేట్ జమాతే ఉలేమ అధ్యక్షులు హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్, స్టేట్ జమాత్ ఉలేమ జనరల్ సెక్రెటరీ ఖలీద్ సాబీర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశమై గంటన్నర సేపు అన్ని రకాల సమస్యలపై చర్చించటం జరిగింది.

గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలపై అమలుపరచాలని తెలంగాణ రాష్ట్రంలో గత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండంగా కీర్తిశేషులు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు బిసి ఈ గ్రూపులో నాలుగు శాతం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లను కల్పించిన దానిని తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితముగా నాలుగు శాతం ముస్లిం మైనారిటీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలైనట్లు చర్యలు చేపట్టాలి.
దీనికి సంబంధించిన సమస్య హైకోర్టులో నడుస్తున్న కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఉర్దూ రెండో అధికార భాష అంతట అమలైనట్లు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్రంలో ఏ మతానికి అయినా సంబంధించిన ఎవరు కూడా అవమానపరిచినట్టు చేయకూడదు అలా చేసిన వ్యక్తులపై కఠినమైన చర్యలు చేపట్టాలని జరగబోయే శాసనసభ సమావేశంలో ఒక ఆర్టికల్ జీవోను అమలుపరచాలని వారు కోరారు.

శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చి మేము ప్రభుత్వం వచ్చినట్లు మీ వంతు మీరు మాకు సహకరించినందుకు మీకు ప్రత్యేక జమాతే ఉలేమా తెలంగాణ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో మసీదులలో పనిచేస్తున్న ఇమామ్ మరియు మౌజాన్ లకు ఆరు నెలల నుండి వారికి రావలసిన నెల ఒకటికి ఐదు వేల రూపాయల చొప్పున వారికి వెంటనే ఇవ్వవలసిన బకాయిలను వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్టేట్ బిసి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ కి ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ అధ్యక్షులు హఫీజ్ పీర్ షబ్బీర్ అహమ్మద్ జనరల్ సెక్రటరీ ఖాళీ కౌ అహ్మద్ సాబీర్ వారిని ఈ సందర్భంగా కోరినారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీయొక్క అన్ని రకాల సమస్యల పరిష్కారం నా వంతు కృషి చేస్తానని రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు ప్రతి ఒక్కరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో 16 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినట్లు ప్రతి ఒక్కరు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి మద్దతు ఇవ్వాలని వారందరినీ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉర్దూ టీచర్ల డీఎస్సీ వెంటనే నిర్వహించి నిరుద్యోగులుగా ఉన్న ఉర్దూ మీడియం చదివిన వారికి స్పెషల్ ఉర్దూ మీడియం డీఎస్సీ నిర్వహించి వారికి ఉపాధ్యాయులుగా నియమించాలని ఖాళీగా ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
అన్ని ఉర్దూ మీడియం పాఠశాలల భవనాల నిర్మాణం చేపట్టాలి, ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి, మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలలలో ఖురాన్ చదివించడానికి పతి మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలల్లో ఇద్దరు ఇమాములను నియమించాలి, అక్కడ ఖాళీ ఉన్న మైనార్టీ ప్రెసిడెంట్ పాఠశాలలో మైనార్టీ వర్గాలకు చెందిన ఉపాధ్యాయులను భర్తీ చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు.