రియాక్టర్ పేలి ఏడుగురు దుర్మరణం..

సంగారెడ్డి, ఏప్రిల్ 3 (విశ్వం న్యూస్): సంగారెడ్డి జిల్లా హత్నర మండలం చందాపూర్ గ్రామ శివారులో గల కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటన పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవెక్షించల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డి ని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్.పి ని కోరారు.

ఘటన స్థలానికి హుటహుటీన బయలు దేరిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్.పి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ల అధికారుల ను ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని హత్నూర మండలం చందపూర్ గ్రామ శివారులోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో రియక్టర్లు పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ పేలుడు దాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో పరిశ్రమలో పనిచేస్తున్న మేనేజర్ కూడా ఉన్నట్టుగా సమాచారం. ప్రమాద సమయంలో ఫ్యా క్టరీక్ట లోపల 50 మంది కార్మికులు ఉన్నట్టుగా చెబుతున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *