పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని ధర్నా: కాంగ్రెస్ పార్టీ డిమాండ్

తిమ్మాపూర్, జనవరి 25 (విశ్వం న్యూస్) : ప్రభుత్వం పెంచిన కరెంటు (ఏసిడి)చార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నారు. అనంతరం అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఏసీడి చార్జీలు వెంటనే తగ్గించాలని, సామాన్య ప్రజలపై భారం మోపూతున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టె రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అన్నారు. ప్రభుత్వం విధ్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆ బారాన్ని ప్రజలపై మోపడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఏసిడి చార్జీలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.