
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విశ్వం న్యూస్) : ఇది గోవాలోని రిసార్టు అనుకొంటున్నారా? కాదు మన హైదరాబాదే. హిమాయత్ సాగర్ కు ఆనుకొని ఉన్న ఈ భారీ ఫాంహౌస్ చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిది. దశాబ్దాల కిందటనే పూర్తిగా బఫర్ జోన్ లో పెద్ద ఎత్తున ఈ ఫాంహౌస్ నిర్మాణం జరిగింది. ఇది కాకుండా కొంతకాలం కిందట మరో బహుళ అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించారు.
అదైతే పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందనేది బహిరంగ రహస్యం. విశాలమైన రహదారులతో చివరిలో ఉన్న ఈ ఫాంహౌస్ గేటు ముందుకు వెళ్లారో ఎక్కువసేపు అక్కడ ఉండలేరు. ఎందుకంటే అక్కడి భారీ సంఖ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డులు మిమ్మల్ని తరిమికొట్టడానికి పరిగెత్తుకొని వస్తారు మరి.