పురచ్చి తలైవర్

  • కేసిఆర్ అనే మొక్కను మొలువనివ్వను.
  • ఓడిస్తా అని చెప్పిన.. ఓడించిన.
  • లోకసభలో గుండుసున్నా అని చెప్పిన..చేసి చూయించిన…….
  • ఇది రేవంత్ నోటి నుండి వెలువడిన మాటలు
  • ఓడించడానికి నీవెంతటోడివి?
  • బాపు కేసిఆర్ కర్మాగారంలో, ఆయన నాయకత్వం లో నడక మొదలుపెట్టినోడివి…….
  • నీ గెలుపు వెనుక ఎన్ని అదృశ్యహస్తాలు ఉన్నాయో,ఎన్ని చీకటిశక్తులు పనిచేశాయో మాకు తెలియదనుకున్నావా?????

హైదరాబాద్, నవంబర్ 18 (విశ్వం న్యూస్) : కేసిఆర్ లేని తెలంగాణను, స్వంత అస్థిత్వం ఉండని తెలంగాణను మళ్ళీ చూడాలనుకున్న పరాయి దోపిడి పెట్టుబడిదారులు,వారి మీడియా మాఫియా తెరవెనుక మంత్రాంగం నడిపి బాపు కేసిఆర్ గారిని ఓడించారు. పరాయి దోపిడి పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే నిన్ను తెరముందు నిలబెట్టారు.
వాళ్ళ కుట్రలకు లొంగిపోయే సరైన పర్సన్ వి నీవేనని వాళ్ళకు తెలుసు,అందుకే నిన్ను సిఎం పీఠం ఎక్కించారు.

వాళ్ళ కోరికను తీర్చాలన్న ఉబలాటంతోనే బాపు కేసిఆర్ ను అన్ని మాటలు అంటున్నావు.
నీవే అన్నావు బాపు కేసిఆర్ గారిని ఉద్దేశించి…మట్టిలో పొర్లనిదే ఏ విత్తనం మొలకెత్తదని.
నిజం! మా బాపు విత్తనమే. విత్తనాన్ని పాతాళంలోకి తోసినా భూమి పొరలను చీల్చుకొని బయటకు వస్తుంది.
బాపు కేసిఆర్ కూడా విత్తనంలాంటోడే..నీవు దుష్టశక్తుల తో ఎన్ని తంత్రాలు నడిపినా జనం అండతో మళ్ళీ వస్తాడు.

బాపు జనం గుండెల్లో ఉన్నాడు.
పడిలేచి,పడిలేచిన తెలంగాణ గడ్డపై పడకుండా నిలబడ్డవాడే మా బాపు కేసిఆర్. రాకాసి అలలు విరుచుకుపడుతున్నా నిలదొక్కొకొని నిటారుగా ఆకాశం ఎత్తన నిలబడ్డవాడు మా బాపు కేసిఆర్. చెన్నారెడ్డి ఛిద్రం అయినచోట విస్పోటనమై పేలినవాడు మా బాపు కేసిఆర్. ఎవరి సహకారంలేకుండా అనేక దాడులను సమర్థవంతంగా ఎదుర్కుంటూ,ఆత్మరక్షణ చేసుకుంటూ..శత్రువును ఆత్మరక్షణలో పడేసి విజయతీరాలకు చేరుకున్నవాడు మా బాపు కేసిఆర్.
తను గెలిచి తెలంగాణను గెలిపించినవాడు మా బాపు కేసిఆర్.

నీవెంత?నీ బిషాత్ ఎంత?
మీకు అర్థంకాని విషయం ఒక్కటి చెప్పనా..
మా బాపు కేసిఆర్ ని దుష్టులకు సద్దులుమోసే నీలాంటివారే తిడుతున్నారు……

నీవు బాపు కేసిఆర్ ని తిడితే…నిన్ను సాధారణ జనం ఎవగించుకునే అవకాశం ఉన్నది……

సామాన్యజనం బాపును ఒక్క చెడ్డమాట కూడా అనడంలేదు.
బాపును దేవుడిలా కొలుస్తున్నారు.
పరాయి దొంగల మూటలందుకొని అనేక యూట్యూబ్ చానెల్స్ పెట్టి.. ప్రజలను ఏమార్చి బాపును ఓడించారు.
ప్రజలకు విషయం అర్థమైంది. ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా విజయం మాదే…..

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అస్తమానం బాపు ఫ్యామిలిపై దూషణలకు దిగితే సమాజం అంగీకరించదు. ఒక చిన్న పదవి రావాలంటేనే చాలా కష్టపడాలి, పాలమూరు మారుమూల గ్రామం నుంచి ఒక ముఖ్యమంత్రి పదవి రావడం అనేది నీ అదృష్టమే కావచ్చు, లేకపోతే నీ లోపల రాజకీయ శక్తి అయినా ఉండి ఉండాలి. ఇంత గొప్ప స్థితికి వెళ్ళినప్పుడు దాన్ని నిభాయించుకోవాలి.. బాపు కేసీఆర్ ఎదురులేని నాయకుడు నిరంతరం ఆయన తిట్టడం వల్ల నువ్వు ప్రజలకు దూరం అవడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *