ఒకవైపు నాగచైతన్య పెళ్లి..
మరో వైపు అఖిల్ నిశ్చితార్థం
హైదరాబాద్, నవంబర్ 26 (విశ్వం న్యూస్) : డిసెంబర్ 4న శోభితతో నాగ చైతన్య వివాహం జరుగుతుండగా.. అంతా ఆ సంబరాల్లో మునిగిపోయారు. సడెన్‌గా ఇప్పుడు అఖిల్ నిశ్చితార్థం కూడా పూర్తయిందనే వార్తతో అక్కినేని అభిమానులకు కింగ్ నాగ్ డబుల్ ట్రీట్ ఇచ్చినట్లయింది. ఇక అఖిల్ (Akhil Akkineni) నిశ్చితార్థం విషయానికి వస్తే.. జైనాబ్ రావుద్జీతో అఖిల్ నిశ్చితార్థం సన్నిహితులైన కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీకి చెందిన జైనాబ్ థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా.. ఆమె సృజనాత్మకత, సంస్కృతి పట్ల ఆమెకున్న ప్రేమ అఖిల్‌కి దగ్గరయ్యేలా చేసినట్లుగా సమాచారం. వీరి నిశ్చితార్థం నాగార్జున ఇంటిలో జరిగినా.. వివాహానికి సంబంధించి ఇంకా ఎటువంటి తేదీని నిర్ణయించలేదని తెలుస్తోంది. వీరి వివాహం వచ్చే ఏడాది ఉంటుందని అక్కినేని సన్నిహిత వర్గాలు మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతోన్న చైతూ-శోభితలకు, అలాగే నిశ్చితార్థం ముగించుకుని పెళ్లికి సిద్ధమవుతోన్న అఖిల్- జైనాబ్ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.