పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు-తీవ్రంగా ఖండించిన దాసోజు

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
తీవ్రంగా ఖండించిన దాసోజు

హైదరాబాద్, డిసెంబర్ 5 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై తప్పుడు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఫిర్యాదు చేయడానికి @acpbanjarahill1 గారి అనుమతితో పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన ఎమ్మెల్యే గారిని అవమానించడమే కాకుండా, ఫిర్యాదు స్వీకరించకుండా, వారి మీదే కేసు పెట్టడం న్యాయస్వతంత్రతను దిగజారుస్తున్న దారుణ చర్య. ఇంతవరకు ప్రజల తరఫున శాసనసభలో వాదిస్తున్న ప్రాతినిధుల పట్ల కూడా ఈ విధంగా ప్రవర్తిస్తే, సామాన్య పౌరుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో (@shopanjagutta) అనామక ఫిర్యాదుపై మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు గారి మీద వెంటనే కేసు నమోదు చేయగలిగిన పోలీసులు, అదే జాగ్రత్త మరియు సమర్థతను సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వచ్చిన ఫిర్యాదుపై ఎందుకు చూపించలేకపోయారు? ఇది సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధికారం దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ. తెలంగాణలో ప్రజాస్వామ్యానికి హాని కలిగించే ఈ విధానాన్ని ప్రజలు తప్పక వ్యతిరేకిస్తారు.

తెలంగాణ పోలీసులు తమ రాజ్యాంగబద్ధమైన బాధ్యతను గుర్తుంచుకుని, నిష్పాక్షికంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్యానికి అనుగుణంగా న్యాయాన్ని అందించాలని హితవు పలుకుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *